Kandorada: కందరాడలో సంచలనం సృష్టించిన జనసేన రెబల్ అభ్యర్థి శివశంకర్ విజయం!

Kandorada: పిఠాపురం నియోజకవర్గం కందరాడలో ఎంపీటీసీ రెబల్ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేసి 277 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పిల్లా శివశంకర్.

RAMA KRISHNA, KKD
Published on: 8 Nov 2026 10:10 AM IST
Kandorada
X

Kandorada: కందరాడలో సంచలనం సృష్టించిన జనసేన రెబల్ అభ్యర్థి శివశంకర్ విజయం!

Kandorada: కందరాడ గ్రామ ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లా శివశంకర్ ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రత్యర్థిపై 277 ఓట్ల మెజా రిటీతో గెలుపొందారు. పార్టీ టికెట్ దక్కకపోయినా ప్రజల మద్దతుతో విజయం సాధించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

గత నెల 26న మాజీ ఎమ్మెల్యే వర్మ దొరబాబు, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసరావు చేతుల మీదుగా పిల్లా శివశంకరు తొలుత బీ-ఫామ్ అందించారు. నాయకుల సమక్షంలో ఆయనకు ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అయితే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ బీ-ఫామ్ను రద్దు చేసి, అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పిల్లా వెంకట దినేష్కు కేటా యించారు. దీంతో మనస్తాపానికి గురైన శివశంకర్ జనసేన రెబల్ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు.

ప్రజల్లో తనకున్న మద్దతుతో ప్రచారం నిర్వహించి, ప్రత్యర్థిపై 277 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ పార్టీ టికెట్ లేకపోయినా ప్రజలు తనకు అండగా నిలిచి గెలిపించారని, ఈ విజయం తనది కాదని, ప్రజల విజయమని పేర్కొన్నారు. ఆయన గెలుపు తో అభిమానులు, అనుచరులు గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD