Pithapuram: హామీలు నెరవేర్చకుంటే భూమి స్వాధీనం! వినూత్నంగా సర్పంచ్ పోటీ
Pithapuram: శ్రీరాంపురం పంచాయతీ ఎన్నికల్లో వినూత్న హామీ! గ్రామాభివృద్ధి చేయకపోతే అరకరం భూమి స్వాధీనానికి వీలునామా రాసిన సర్పంచ్ అభ్యర్థి పాటి నాగ సత్యనారాయణ.
Pithapuram: హామీలు నెరవేర్చకుంటే భూమి స్వాధీనం! వినూత్నంగా సర్పంచ్ పోటీ
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో వినూతనంగా పోటీ చేస్తున్న యువ కెరటం పాటి నాగ సత్యనారాయణ తన ధర్మపతిని సత్యవేణి పోటీ చేస్తున్నారని అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తూ తన సొంత ఆస్తులైనా అరకరం భూమిని హామీగా ఇస్తూ పోటీలో నిలబడడం విశేషం.
కె ఎస్ఈజెడ్ అవడం వలన 18 సంవత్సరాలుగా తన గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని దానిని,ఇప్పటికైన అభివృద్ధి పథంలో తన గ్రామం ఉండాలని ఉద్దేశంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందాని అన్నారు.
ముఖ్యంగా గ్రామంలో సోలార్ ప్లాంట్ లు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, అలాగే రెండు ఆర్వో ప్లాంట్లు, రోడ్లు మరియు సోలార్ లైట్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, వీటన్నిటినీ కచ్చితంగా అమలు చేసి తీరతామని,అలా లేనియెడల తను హామీ పెట్టిన భూమిని పంచాయతీ వారు స్వాధీన పరుచుకోవచ్చని వీలునామా రాస్తున్నానని అన్నారు.
ఇలా వినూత్నంగా రాజకీయలోకి వస్తున్న యువ రాజకీయ నాయకులకు ప్రజలు మద్దతు ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




