Pithapuram: పురుహూతిక అమ్మవారికి విరవ గ్రామస్తుల 'ఆషాఢ సారీ'

Pithapuram: పిఠాపురం శ్రీ పురుహూతికా అమ్మవారికి ఆషాఢ మాస సారీ సమర్పించిన విరవ గ్రామ మహిళలు. కాలినడకన విచ్చేసిన 300 మంది భక్తులకు ఆలయ ఈవో అన్నప్రసాద వితరణ.

RAJESH,	WEST ZONE
Updated on: 23 July 2026 3:22 PM IST
Pithapuram
X

Pithapuram: పురుహూతిక అమ్మవారికి విరవ గ్రామస్తుల 'ఆషాఢ సారీ'

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం. శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో కొలువై ఉన్న 10వ శక్తి పీఠం శ్రీ పురుహూతికా అమ్మవారికి ఆషాఢ మాసం సారీ సమర్పించిన విరవ గ్రామస్తులు.

భక్తిశ్రద్ధలతో, నిష్ట నియమాలతో ప్రతి సంవత్సరం 300 మంది మహిళల భక్తులతో సారి సమర్పణ. విరవ నుండి ఉదయము కాలినడకన బయలుదేరి పాధగయకి చేరుకున్న మహిళా భక్తులు.

పాదగయ దేవస్థా రాజగోపురం నుండి ఆహ్వానం పలికిన ఆలయ సిబ్బంది. అనంతరం మేళ తాళాల మధ్య పురుహూతిక అమ్మవారికి సారి సమర్పణ. సారి సమర్పణ నిమిత్తం వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగర్తలు తీసుకున్న ఆలయ సిబ్బంది. సారి సమర్పణ అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేసిన ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story