Pithapuram: తాడిపత్రి గ్రామంలో పోలీసుల మెరుపు సోదాలు.. 38 బైకులు స్వాధీనం!
Pithapuram: కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం తాడిపత్రి గ్రామంలో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
Pithapuram: తాడిపత్రి గ్రామంలో పోలీసుల మెరుపు సోదాలు.. 38 బైకులు స్వాధీనం!
కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గం.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ్ మానేష్ ఐపీఎస్ పర్యవేక్షణలో, ఈ రోజు తెల్లవారుజామున తాడిపత్రి గ్రామం, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల నిమిత్తం , అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ మరియు నేరాల నివారణ దృష్ట్యా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది కలిసి విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ముఖ్య ప్రాంతాలు, వీధులు మరియు అనుమానాస్పద ప్రాంతాలను చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించబడగా, పాత నేరస్తులు మరియు అనుమానితుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించబడింది. అదేవిధంగా వాహనాలపై విస్తృత తనిఖీలు నిర్వహించగా సరైన పత్రాలు (ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్) లేని మొత్తం 38 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కొత్తగా గ్రామానికి వచ్చే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని, వారి వివరాలు తెలుసుకోవాలని మరియు అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే పోలీస్ శాఖ సర్వైలెన్స్ చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తూ, రాత్రి పహారా మరియు నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరడమైనది.




