Kakinada: ఏలేరులో 38 లక్షల చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే సత్యప్రభ
Kakinada: కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఏలేరు జలాశయంలో మత్స్యకారుల జీవనోపాధి పెంపే లక్ష్యంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ 38 లక్షల మేలురకం చేప పిల్లలను విడుదల చేశారు.
Kakinada: ఏలేరులో 38 లక్షల చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే సత్యప్రభ
కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఏలేరు జలాశయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్య శాఖ అధికారి రాజేంద్ర అద్వర్యంలో 38 లక్షల చేప పిల్లలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చేతులు మీదుగా ఏలేరు జలాశయంలో వదిలారు.
మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు పెంపొందించుటకు కాకినాడ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లకు చెందిన ప్రభుత్వ మత్స్య విత్తన క్షేత్రంలో తయారైన మేలు రకం చేప పిల్లలను ఏలేరు జలాశయం లో వదిలామని తెలిపారు.
ఏలేరు రిజర్వాయర్ లో చేప పిల్లలు విడుదల చేయడం ద్వారా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని దీని ద్వారా జీవనోపాధి మెరుగు అవుతుందని తెలిపారు.
ఏలేరు రిజర్వాయర్ లో చేపలు మంచి రుచికి చాలా ప్రసిద్ధి. ఈ చేప పిల్లల విడుదల కార్యక్రమం వలన రిజర్వాయర్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక ప్రజలందరికీ మంచి ప్రోటీన్ ఆహారం లభిస్తుందని అన్నారు.
నిషేధ సమయంలో మత్స్యకారులు జలాశయం లో వేట నిర్వహించరాదని, చిన్న సైజు కన్నువల వేటకు ఉపయోగించరాదని తెలిపారు. నిషేధిత సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వంతో చర్చించి ఉపాధి కల్పించే దిశగా పనిచేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావు. జిల్లా మత్స్యశాఖ అధికారులు వి కృష్ణారావు, కే కరుణాకర్, ఎస్ఎస్సి కోఆర్డినేటర్ సత్యనారాయణ,తాసిల్దార్ కే కీర్తి, ఆప్కాఫ్ వైస్ చైర్మన్ బలసాడి రంగారావు, నాలుగు మండలాల ఎంపీడీవోలు, ఏలేశ్వరం మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, మూది నారాయణస్వామి, బొదిరెడ్డి గోపి, అలమండ చలమయ్య, మామిడి లలిత,మైరాల కనకయ్య, జగటాపు సూరిబాబు, కర్రోతు గాంధీ, కోట్ల కృష్ణ, నూకతాటి ఈశ్వరుడు, మత్స్ శాఖ అధికారులు అనురాధాదేవి, నూకరాజు, పలువురు అధికారులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.




