Prathipadu: నైపుణ్య కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఎస్సై లక్ష్మీకాంతం
Prathipadu: ప్రత్తిపాడు నైపుణ్య కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఎస్సై లక్ష్మీకాంతం పాల్గొని ఆపరేషన్ త్రిశూల్, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
Prathipadu: నైపుణ్య కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఎస్సై లక్ష్మీకాంతం
ప్రత్తిపాడు: ప్రత్తిపాడులోని సరయు ఫంక్షన్ హాల్‌లో నైపుణ్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ త్రిశూల్ గురించి విద్యార్థులకు వివరించారు.మహిళల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.




