Kakinada: తునిలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు!
Kakinada: తుని పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Kakinada: తునిలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు!
Kakinada: కాకినాడ జిల్లా తుని పట్టణ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డి-మార్ట్ సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ప్రయాణికుల్లో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




