Tuni: తలుపులమ్మ లోవ పుణ్యక్షేత్రంలో భారీ కొండచిలువ కలకలం
Tuni: కాకినాడ జిల్లా తలుపులమ్మ లోవ ఆలయం వద్ద భారీ కొండచిలువ ప్రత్యక్షం. స్నేక్ క్యాచర్ రాజు చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడుదల.
Tuni: తలుపులమ్మ లోవ పుణ్యక్షేత్రంలో భారీ కొండచిలువ కలకలం
తుని: తుని సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ లోవ కొండ దిగువన ఉన్న పాకల వద్ద భారీ కొండచిలువ ప్రత్యక్షమవడంతో స్థానికులు, భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఇదే క్రమంలో ఒక భారీ కొండచిలువ కొండ దిగువన ఉన్న భక్తుల వసతి పాకల వద్ద. రావడాన్ని స్థానికులు గమనించి భయపడి పరుగులు తీశారు.
ఈ సమాచారం తెలియడంతో స్థానిక స్థానిక స్నేక్ క్యాచర్ రాజు, అక్కడికి చేరుకుని ఎంతో చాకచక్యంగా, ఆ కొండచిలువను బంధించారు.
ప్రాణనష్టం లేదా ఎటువంటి అపాయం జరగకుండానే రాజు ఆ కొండచిలువను సురక్షితంగా పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం, ఆ పామును అటవీశాఖ అధికారుల సమక్షంలో సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో క్షేమంగా వదిలిపెట్టారు.
Next Story




