Samalkot: సామర్లకోట రైల్వే స్టేషన్‌లో ‘స్వచ్ఛత హి సేవా’
Samalkot: సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్‌లో భారతీయ రైల్వే ఆధ్వర్యంలో 'స్వచ్ఛత హి సేవా - 2026' పరిశుభ్రత డ్రైవ్, ప్రత్యేక గేమ్స్ నిర్వహించారు.
Samalkot: సామర్లకోట రైల్వే స్టేషన్‌లో ‘స్వచ్ఛత హి సేవా’
Samalkot: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవా - 2026 కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 15 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శని వారం సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు మరియు గేమ్స్ ఆడించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది పాల్గొన్నారు. డాక్టర్ శ్రీలక్ష్మి, స్టేషన్ మేనేజర్ రమేష్, హెల్త్ ఇన్స్పెక్టర్ కళ్యాణి, సీనియర్ నర్సింగ్ సూపరిడేంట్, డిపార్ట్మెంట్ల స్టాఫ్, మరియు కాంట్రాక్ట్ స్టాఫ్ పాల్గొని స్టేషన్ ను శుభ్రం చేశారు.




