Tuni: తునిలో పది రోజులుగా రోడ్డుపైనే వర్షపు నీరు.. ప్రజల ఆగ్రహం!

Tuni: కాకినాడ జిల్లా తుని శ్రీ కృష్ణ పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డుపై పది రోజులుగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

MANIKANTA, TUNI
Published on: 14 Nov 2026 6:31 PM IST
Tuni
X

Tuni: తునిలో పది రోజులుగా రోడ్డుపైనే వర్షపు నీరు.. ప్రజల ఆగ్రహం!

తుని (కాకినాడ జిల్లా): తుని పట్టణంలోని శ్రీ కృష్ణ పెట్రోల్ బంకుకు ఎదురుగా ఉన్న రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయి దాదాపు పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తొలగకపోవడంపై స్థానికులు, వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు చేరింది. వారం రోజులు దాటినా ఆ నీరు వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోయింది. నిల్వ ఉన్న నీటి నుంచి విపరీతమైన దుర్వాసన వెదజల్లుతుండటంతో అటువైపుగా వెళ్లే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నీరు నిలిచి ఉండటం వల్ల రోడ్డు ఎక్కడ గుంతలు పడిందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడే ప్రమాదం ఉందని, సంబంధిత మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి నిలిచిన నీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI