Tuni: చిన్నారి జ్ఞానేశ్వరి కేసు పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి - రామచంద్ర యాదవ్
Tuni: కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన రామచంద్ర యాదవ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామాకు డిమాండ్ చేశారు.
Tuni: చిన్నారి జ్ఞానేశ్వరి కేసు పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి - రామచంద్ర యాదవ్
Tuni: కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్.
చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బోడె రామచంద్ర యాదవ్ ఆరోపించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల అదృశ్య ఘటనలపై గట్టిగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నేడు రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ విషయంలో మాత్రం సమర్థంగా స్పందించడం లేదని విమర్శించారు.
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకుని చిన్నారిని గుర్తించే చర్యలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో హోం మంత్రిత్వ శాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని, హోం మంత్రిని డమ్మీగా మార్చి నారా లోకేష్ నాయుడు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
చిన్నారి జ్ఞానేశ్వరి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బోడె రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు.




