Rayavaram: రాయవరం - దొంతమూరు రహదారి పరిస్థితిని పరిశీలించిన అధికారులు

Rayavaram: రాయవరం - దొంతమూరు రోడ్డు పరిస్థితిని అధికారులతో కలిసి పరిశీలించాము. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు.

V. Ramakrishna, Pithapuram
Published on: 5 Oct 2026 7:23 PM IST
Rayavaram
X

Rayavaram: రాయవరం - దొంతమూరు రహదారి పరిస్థితిని పరిశీలించిన అధికారులు

రాయవరం: రాయవరం నుంచి దొంతమూరు వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన పరిస్థితులను ఈరోజు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.

రోడ్డుపై ఏర్పడిన పరిస్థితులపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు వెల్లడించారు. ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పైపులు వేయడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అలాగే రోడ్డుకు ఇరువైపులా బెర్మ్ ఏర్పాటు చేయడానికి అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా రోడ్డు నిర్మాణ నాణ్యతను కూడా అధికారులు పరిశీలించగా, నిర్మాణ నాణ్యతలో ఎలాంటి లోపం లేదని నిర్ధారించారు.

అయితే ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చర్యలు త్వరగా చేపట్టేలా పర్యవేక్షించడం జరిగింది.

ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించడం మన అందరీ బాధ్యత.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram