Razole: మాకు రక్షణ గోడలతో మంచి వంతెన నిర్మించండి సార్.. పిల్లల గోడు
Razole: మాకు రక్షణ గోడలతో మంచి వంతెన నిర్మించండి సార్! రాజోలు మండలం ములికిపల్లి (మామిడిశెట్టివారిపాలెం) లో పంట కాలువపై శిథిలావస్థకు చేరిన వంతెన.
Razole: మాకు రక్షణ గోడలతో మంచి వంతెన నిర్మించండి సార్.. పిల్లల గోడు
Razole: రాజోలు మండలం ములికిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిశెట్టివారిపాలెం లో ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్ పిల్లల కొరకు రెండవ నెంబర్ పంట కాలువపై దాదాపు పది, పదిహేన ఏళ్ల క్రితం వేసిన ఈ వంతెన ప్రమాదకరంగా తయారయింది. వంతెన పూర్తిగా పాడైపోయి రక్షణ గోడలు లేక స్కూల్ పిల్లల భయంతో వంతెన పై నడక సాగిస్తున్నారు. ఈ ప్రభుత్వ బోర్డు స్కూల్ లో సుమారు 30 నుండి 40 మంది వరకు 1 నుండి 5 వ తరగతి వరకు చిన్న పిల్లలు చదువుకుంటున్నారు.
అయితే వంతెనకు అటు ప్రక్క ఇటు ప్రక్క ఏవిధమైన అప్రోచ్ లేకపోవడం వర్షాల సమయంలో బురదమయంగా తయారౌతుంది. వంతెన పై నడిచేటప్పుడు ఎక్కడ కాలుజారి పంట కాల్వలో పడిపోతామేమోననే భయాందోళనలు స్కూల్ పిల్లలను కలవరపెడుతున్నాయి. దీంతో ఏళ్లు గడిచిన పాత వంతెన స్థానే రక్షణ గోడలతో, పకడ్బందీగా కొత్త వంతెన నిర్మించి తమ పిల్లలకు రక్షణ కల్పించాలని పిల్లల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.




