Razole: ప్రతి ఇంటికీ శుద్ధ జలమే లక్ష్యం.. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Razole: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మలికిపురంలో 20 KL ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Razole: ప్రతి ఇంటికీ శుద్ధ జలమే లక్ష్యం.. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Razole: అమరజీవి-జలధార వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా రాజోలు నియోజకవర్గం లోని మలికిపురం మండలం, మలికిపురం గ్రామంలో 20 KL సామర్థ్యంతో నిర్మించనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుకు రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ ఈరోజు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. అమరజీవి-జలధార వాటర్ గ్రిడ్ పథకం రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన బృహత్తర కార్యక్రమమని తెలిపారు.
ప్రతి ఇంటికి ప్రతిరోజూ శుద్ధమైన త్రాగునీరు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే పైప్‌లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. పనులు సమర్థవంతంగా పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు,సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




