Peddapuram: పెద్దాపురం తొలి తిరుపతిని సందర్శించిన ఆర్డీఓ కృష్ణమూర్తి
Peddapuram: పెద్దాపురం తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆర్డీఓ పి. కృష్ణమూర్తి. ఆలయ పరిసరాలు, అన్నదాన కార్యక్రమ పరిశీలన.
Peddapuram: పెద్దాపురం తొలి తిరుపతిని సందర్శించిన ఆర్డీఓ కృష్ణమూర్తి
పెద్దాపురం: పెద్దాపురం మండలం తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభస్వామి వారిని పెద్దాపురం ఆర్డీఓ పి. కృష్ణమూర్తి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆర్డీఓకు కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాసరావు, పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
స్వామి వారిని దర్శించుకున్న ఆర్డీఓ స్వామి వారికి ప్రత్యేక పూజల నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ పండితులు ఆర్డీఓకు వేద ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆర్డీఓ ఆలయ పరిసరాలు, అన్నదానం జరుగుతున్న విధానాలు పరిశీలించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, తిరుపతి మాజీ సర్పంచ్ మొయిళ్ళ కృష్ణమూర్తి ఆర్డీఓకు ఆలయం పరిస్థితులు వివరించారు. ఈ సందర్భంగా ఆలయంలో పరిస్థితి, అన్నదాన జరుగుతున్న విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈఓ శ్రీనివాసరావును అభినందించారు.




