Kakinada: ఆర్టీఐ రికార్డులు లేకపోతే షోకాజ్ నోటీసులు కమిషనర్ చక్రవర్తి!
Kakinada: కాకినాడ జిల్లాలో రాష్ట్ర సమాచార కమిషనర్ వి.ఎస్.కె. చక్రవర్తి ఆకస్మిక తనిఖీలు. నిబంధనలు ఉల్లంఘించిన కార్యాలయాలకు షోకాజ్ నోటీసులు జారీ.
Kakinada: ఆర్టీఐ రికార్డులు లేకపోతే షోకాజ్ నోటీసులు కమిషనర్ చక్రవర్తి!
Kakinada: కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్ర సమాచార కమిషనర్ వి.ఎస్.కె. చక్రవర్తి జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత ఆయన సామర్లకోట మున్సిపల్ కార్యాలయాన్ని, సామర్లకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయా ల్లో సిటిజన్ చార్టర్ బోర్డు లేకపోవడం, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించక పోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం కాకినాడ పట్టణంలోని ప్రాంతీయ విద్యాశాఖ కార్యాలయం, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, సమగ్ర శిక్ష కార్యాలయాలను సమాచార కమిషనర్ తనిఖీ చేశారు. 2026 సంవత్సరానికి సంబం ధించి ఆర్టీఐ దరఖాస్తులను ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేయకపోవడం, పౌర సేవల వివరాలను తెలిపే పట్టికలు ప్రదర్శించకపో వడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత కాకినాడ ప్రజారవాణా అధికారి కార్యాలయానికి చేరుకుని, డీపీటీఓ, డీఎం కార్యాల యాలను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసు కున్నారు.
మధ్యాహ్నం భోజనం తర్వాత ఆర్ అండ్ బి కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార కమి షనర్ వి.ఎస్.కె.చక్రవర్తి మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం సమర్థవం తమైన అమలు సుపరి పాలనకు నిదర్శనమన్నారు. ప్రజలకు సమాచారమే శక్తి, ఆ హక్కును పరిరక్షిం చడమే అధికారుల బాధ్య తనీ. నిబంధనలు ఉల్లం ఘించిన కార్యాల యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం మరింత బలోపేత మవుతాయన్నారు.
ప్రజలకు సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి చట్టబద్ధమైన విధి అన్నారు.ఈ తనిఖీల్లో భాగంగా కార్యాలయాల్లో సమాచార ప్రకటన నిబం ధనల అమలు, ప్రజా సమాచార అధికారుల నియామకం, మొదటి అప్పీలేట్ అధికారుల వివరాల ప్రదర్శన, సమాచార హక్కు దరఖాస్తులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఆయన నిశితంగా పరిశీలించారు. సమాచార హక్కు చట్టం కేవలం సమాచారం అందించే చట్టం మాత్రమే కాదని, అది ప్రజాస్వా మ్యాన్ని బలోపేతం చేసే ఒక కీలక సాధనమని కమిషనర్ పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సెక్షన్ 4(1)(b) కింద ముందస్తుగానే స్వచ్ఛందంగా అందుబా టులో ఉంచితే, సమాచార హక్కు దరఖాస్తులు, అప్పీళ్ల సంఖ్య కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, ప్రజలకు సకాలంలో సమా చారం అందించి పారదర్శకతకు పెద్దపీట వేయాలని సమాచార కమిషనర్ అధికారులను ఆదేశించారు.




