Samalkot: యేసు ప్రేమ సందేశంతో రన్.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న క్రైస్తవ సోదరులు
Samalkot: సామర్లకోటలో ఘనంగా 'రన్ ఫర్ జీసస్'! యేసుక్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకుని పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
Samalkot: యేసు ప్రేమ సందేశంతో రన్.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న క్రైస్తవ సోదరులు
సామర్లకోట: సామర్లకోట పట్టణంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సామర్లకోట మండల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని స్థానిక సిబిఎం పాఠశాల వద్ద మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్ జండా ఊపి ప్రారంభించారు. గుడ్ ఫ్రైడే రోజున యేసు సిలువ వేయబడి మూడో రోజు ఆదివారం మృత్యుంజయుడై తిరిగి లేచిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు.ఏసు ప్రభువు ప్రేమ, కరుణ, త్యాగం గురించి పురవీధులలో వివరిస్తు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేపట్టారు.
స్థానిక సిబిఎం పాఠశాల వద్ద రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రారంభమై బ్రౌన్ పేట, పాత ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్, మెహర్ కాంప్లెక్స్, స్టేషన్ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, బల్ల మార్కెట్ మీదుగా ఆంధ్ర జూబ్లీ బాప్టిస్ట్ చర్చి వరకు కొనసాగింది. ర్యాలీ ఆద్యంతం ఏసుక్రీస్తు తిరిగి లేచెను.. జయహో జయహో యేసు ప్రభువు జయహో అంటూ పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు నినాదాలు చేస్తూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పట్టణంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ క్రైస్తవ గీతాలను ఆలపించారు.ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్, మండల పాస్టర్ అసోసియేషన్ నాయకులు పాస్టర్ ఎ.చంటి, పి ఆనంద్ బాబు, రాజేష్ కుమార్, స్టీవెన్ కింగ్, టీ.బ్లెస్సింగ్,వి.జాన్, బి.వి రాజు,ఏం.జేమ్స్, ఆర్.లాజరస్, సత్యానందం,మడికి సోనీ విజయ్ కుమార్,జయబాబు, సల్లూరి కళ్యాణ్, పట్టణంలోని వివిధ సంఘాల క్రైస్తవ సోదర సోదరీమణులు విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




