Samalkot: సామర్లకోట రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత!

Samalkot: సామర్లకోట స్టేషన్‌లో రూ.60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, నెల్లూరుకు చెందిన ఐదుగురు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 12 Aug 2026 12:49 PM IST
Samalkot
X

Samalkot: సామర్లకోట రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత!

Samalkot: సామర్లకోట రైల్వే స్టేషన్లో బుధవారం జి.ఆర్.పి పోలీసులు జరిపిన తనిఖీలలో గంజాయి రవాణా సాగిస్తున్న ఐదుగురు మహిళలు పట్టుబడినట్లు జి అర్ పి రాజమండ్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఎస్ఐ వాసు తెలిపారు.సామర్లకోట రైల్వే స్టేషన్ లో గంజాయి రవాణా కబడుతున్న సమాచారం మేరకు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు.

స్థానిక రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారం నెంబర్ రెండు, మూడులో కొందరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించటంతో పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించామన్నారు.ఆ మహిళల వద్ద ప్లాస్టిక్ బ్యాగ్ లలో 60 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు.

దీని విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. రైల్వే ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్ ఎస్ ఐ వాసు తెలిపారు.గంజాయి రవాణా చేస్తున్న మహిళలలు నెల్లూరు జిల్లా బిట్రగుంట ప్రాంతానికి చెందిన వారని,వారి అరెస్ట్ చేసి విజయవాడ రైల్వే కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story