Pithapuram: పిఠాపురం మహిళా సాధికారతకు సరస్వతి రత్న ఫౌండేషన్ కృషి

Pithapuram: కొండెవరంలో మగ్గం వర్క్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేసిన తుమ్మల రామస్వామి బాబు. ఫౌండేషన్ సేవలను కొనియాడిన జనసేన నేతలు.

V. Ramakrishna, Pithapuram
Published on: 11 July 2026 8:08 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం మహిళా సాధికారతకు సరస్వతి రత్న ఫౌండేషన్ కృషి

పిఠాపురం: గ్రామీణ మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సరస్వతి రత్న ఫౌండేషన్ వ్యవస్థపకులు వి. అప్పలరాజు, వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "స్వశక్తి సంకల్పం" కార్యక్రమం ఆదర్శప్రాయమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు.

పిఠాపురం నియోజకవర్గం, యూ. కొత్తపల్లి మండలం, కొండెవరం గ్రామంలోని వి.ఎన్.ఆర్. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణ మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణలో భాగంగా మగ్గం వర్క్ (Aari/Maggam Work) శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ సర్టిఫికెట్లు, మగ్గం వర్క్‌కు అవసరమైన పరికరాలు, మెటీరియల్స్‌ను అందజేశారు.

అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు సైకిల్ స్టాండ్‌ను అందజేయడంతో పాటు విద్యలో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విద్య, మహిళా సాధికారత, ఉపాధి కల్పన వంటి అంశాలపై సరస్వతి రత్న ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా నైపుణ్య శిక్షణ అందించడం సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా సంక్షేమం, యువత, మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభం కావడం ఆనందదాయకమని, సమాజంలో సేవాభావంతో పనిచేసే సంస్థలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సరస్వతి రత్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి. అప్పలరాజు, వెంకటరమణ (బ్యాంక్ మేనేజర్), జట్ల సూరిబాబు (ఎన్‌ఆర్‌ఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్) పాల్గొన్నారు.

అలాగే పాడ ఏపీడీ వసంత మాధవి, యూ. కొత్తపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు రావు అక్షయ్, ఆంధ్రప్రదేశ్ ఖాదీ గ్రామీణ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్,RSETI డైరెక్టర్ తప్పేట్ల జయకుమార్,అసిస్టెంట్ డైరెక్టర్ రెహమాతుల్లా,కాకినాడ సిటీ జనసేన నాయకులు నల్లం శ్రీనివాస్, గాది కొండబాబు, గాది గోపి, పుల్ల కొండబాబు, గాది రాజా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story