Annavaram: అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.22 కోట్లు!
Annavaram: కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని హుండీల ద్వారా గత 30 రోజులకు గానూ రూ.1,22,18,492 నగదు ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Annavaram: అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.22 కోట్లు!
Annavaram: సత్యదేవునికి భక్తులు గత 30 రోజులకు గానూ హుండీలలో సమర్పించిన నగదు , ఇతర కానుకలను లెక్కింపు చేపట్టారు.
దేవస్థానం ఈ ఓ నల్లం సూర్యచక్రధరరావు ,చైర్మన్ ఐ.వి.రోహిత్ దేవస్థానం పాలకమండలి సభ్యులు,డిప్యూటీ, అసిస్టెంట్ కమీషనర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇతర దేవస్థానం సిబ్బంది ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ లెక్కింపు లో గత 30 రోజులకు గానూ నగదు 1 కోటి 22 లక్షల 18 వేల 492 రూపాయలు కాగా ,బంగారం 29 గ్రా..., వెండి 290 గ్రా..,కొద్ది మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం లభించాయి.




