Rajapudi: రాజపూడిలో వైసీపీకి షాక్: టీడీపీలోకి 100 కుటుంబాలు
Rajapudi: జగ్గంపేట మండలం రాజపూడిలో 100 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సమక్షంలో టీడీపీలో చేరాయి.
Rajapudi: రాజపూడిలో వైసీపీకి షాక్: టీడీపీలోకి 100 కుటుంబాలు
జగ్గంపేట: జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన ముమ్మన పెద్దకాపు, బొడ్డు నాగన్న, కానమరెడ్డి ప్రసాద్, బొడ్డు తాతాజీ, కనకాల శ్రీనివాస్, కనకాల గణపతి, ముమ్మన వీర వెంకటరమణ, ద్వారపూడి ఆది, పెనిశెట్టి శ్రీను తదితరుల ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.
ముందుగా గ్రామానికి చేరుకున్న జ్యోతుల నవీన్ కు టీడీపీ శ్రేణులు పండగ వాతావరణంలో డప్పు వాయిద్యాలు, మందుగుండు సామగ్రి, పూల వర్షంతో ఘన స్వాగతం పలికాయి. అనంతరం నవీన్ వారందరికీ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించాడు.
ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ...
"ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగుతోంది. తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, అన్నదాత సుఖీభవ, యువతకు ఉద్యోగాలు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో మీ అందరి సహకారంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరినీ గెలిపించుకుని గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందాం" అని అన్నారు .
పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ...
"జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ నాయకత్వం నచ్చి టీడీపీలో చేరుతున్నాం. రాజపూడి గ్రామ అభివృద్ధికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి శక్తివంచన లేకుండా పని చేస్తాం" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




