Shankhavaram: శంఖవరం గ్రామంలో బైపాస్ రోడ్డు కోరుతూ శాంతియుత నిరసన దీక్ష!
Shankhavaram: కాకినాడ జిల్లా శంఖవరం గ్రామంలో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేసి, బైపాస్ రోడ్డు నిర్మించాలంటూ గ్రామస్తులు శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు.
Shankhavaram: శంఖవరం గ్రామంలో బైపాస్ రోడ్డు కోరుతూ శాంతియుత నిరసన దీక్ష!
Shankhavaram: శంఖవరం గ్రామ అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు మేకల కృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనకు బిజెపి నేత చిలుకూరి రామకుమార్, తో పలువురు మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా శంఖవరం గ్రామం మీదుగా భారీ వాహనాల రాకపోకలు వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తెలిపారు.
గత నాలుగు సంవత్సరాలుగా బైపాస్ రోడ్డు నిర్మించాలంటూ అధికారులకు అనేక మార్లు పిర్యాదులు చేసినా పట్టించుకున్న నాధుడు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రౌతులపూడి మండలం జల్దాం నుండి వందలాది సంఖ్యలో మైనింగ్ లారీలు శఖవరం గ్రామం మీదుగా వెళుతున్నాయని అధిక లోడ్లతో ప్రయాణించే భారీ లారీల వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, తెలిపారు.
ఈ మైనింగ్ వాహనాల వల్ల జరిగిన ప్రమాదాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జల్దాం నుండి కత్తిపూడి వరకూ బైపాస్ రోడ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. మా సమస్యను పరిష్కరించని ఎడల గ్రామ ప్రజల సహకారంతో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా వెల్లడించారు.




