Samarlakota: సామర్లకోట రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛత హి సేవా!

Samarlakota: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్‌లో 'స్వచ్ఛత హి సేవా' కార్యక్రమంలో భాగంగా స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 7 Oct 2026 4:23 PM IST
Samarlakota
X

Samarlakota: సామర్లకోట రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛత హి సేవా!

Samarlakota: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛత హి సేవా - 2026’ కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 15 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్లో స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ చేశారు. ట్రాక్ క్లియర్, స్టేషన్ యార్డ్ నడుస్తున్న లైన్ల వెంబడి పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు స్క్రాప్‌ను తొలగించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 10 మంది పాల్గొన్నారు. స్టేషన్ మేనేజర్ రమేష్, హెల్త్ ఇన్స్పెక్టర్ కళ్యాణి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గిరి, డిపార్ట్మెంట్ల స్టాఫ్, మరియు కాంట్రాక్ట్ స్టాఫ్ పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM