Kakinada: కోటనందూరు కేజీబీవీలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ప్రారంభం!

Kakinada: కాకినాడ జిల్లా కోటనందూరు కేజీబీవీలో ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య చేతుల మీదుగా 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమాలు ప్రారంభం.

MANIKANTA, TUNI
Published on: 19 Sept 2026 1:16 PM IST
Kakinada
X

Kakinada: కోటనందూరు కేజీబీవీలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ప్రారంభం!

Kakinada: కోటనందూరు కేజీబీవీ వసతి గృహంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటి, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. వసతుల పరిశీలన పాఠశాలలోని వసతులు, భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటించారు.

ర్యాలీ & ప్రతిజ్ఞ స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. జడ్పీ హైస్కూల్ ప్లే గ్రౌండ్‌లో క్రీడాకారుల సౌకర్యార్థం రన్నింగ్ ట్రాక్ మరియు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI