Peddapuram: మాధవపట్నంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన నిమ్మకాయల రంగనాగ్!
Peddapuram: భారీ వర్షాలకు మాధవపట్నంలో మునిగిన ప్రాంతాలను పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్, కూటమి నేతలు పరిశీలించి జేసీబీలతో నీటిని మళ్లించారు.
Peddapuram: మాధవపట్నంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన నిమ్మకాయల రంగనాగ్!
పెద్దాపురం: 3రోజులు నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షలాకి మాధవపట్నం గ్రామంలో నీటమునిగిన ముంపు ప్రాంతాలలో మన పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయల చిన రాజప్ప గారు తనయులు టీడీపీ పార్టీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షలు శ్రీ నిమ్మకాయల రంగనాగ్ గారు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ పెంకే వెంకటేష్ గారు.
సామర్లకోట టీడీపీ మండల ప్రెసిడెంట్ ముసిరెడ్డి శ్రీరాములు, సామర్లకోట టీడీపీ మండల పార్టీ సెక్రటరీ పెంకే శివరామకృష్ణ గారు, మాధవపట్నం గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ పెంకే రామకృష్ణ గారు, యూనిట్ ఇంచార్జ్ పిల్లి శ్రీను గారు మరియు కూటమి నాయకులు పర్యవేక్షించి అక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి JCB లను పంపించి నీటిని దిగువన ఉన్న ప్రాంతంలోకి మల్లించడం జరిగింది.
అలాగే మంచినీటి చెరువు చుట్టూ ఉన్న గట్టు తెగిపోయి పడిపోవడంతో డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి పనులు ప్రారంభించామని చెప్పారు. అలాగే నీట మునిగిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు పశువుల ఆసుపత్రిని సందర్శించడం జరిగింది.




