Samarlakota: సామర్లకోటలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ నేత రంగనాగ్!

Samarlakota: సామర్లకోట పిఠాపురం రోడ్డులోని ముంపు ప్రాంతాలైన టిడ్కో గృహాలను టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగ్ పరిశీలించి, బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 25 Sept 2026 6:56 PM IST
Samarlakota
X

Samarlakota: సామర్లకోటలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ నేత రంగనాగ్!

Samarlakota: ఇటీవల కురిసిన భారీ వర్షాల దాటికి సామర్లకోట పట్టణం పిఠాపురం రోడ్ నందు గల టెడకో గృహల వద్ద మోకాళ్ళ లోతు వరద నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ , మున్సిపల్ కమిషనర్ గారు, ఎమ్మార్వో , యార్లగడ్డ చిన్ని , కుమారస్వామి , బలుసు వాసు నిమ్మకాయల కిరణ్ కుమార్ వల్లూరి దొరబాబు , జర్జ్ చక్రవర్తి ,నిడదవోలు వీర్రాజు ,ఇంజమల బాలు ,కొల్లి నాగ సునీత , బొందల రామలక్ష్మీ శ్రీనివాస్, స్థానిక టీడీపీ నాయకులు, జనసేన పార్టీ సరోజ వాసు , శ్యామ్ ,తుమ్మల ప్రసాద్ ,స్థానిక జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లిన నాయకులు బాధితులను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని అభయం ఇచ్చారు. అనంతరం వరద బాధితులకు తక్షణ సహాయంగా ఆకలి తీర్చేందుకు ఆహార పొట్లాలు మరియు సురక్షిత తాగునీటి బాటిళ్లను అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ "వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరినీ ఆదుకోవడమే మన మొదటి ప్రాధాన్యత. నీరు పూర్తిగా తొలగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పార్టీ తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం" అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో పలువురు స్థానిక టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM