Peddapuram: మత సామరస్యాన్ని దెబ్బతీస్తే ఊరుకోం!

Peddapuram: ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తున్న జడ శ్రావణ్, ప్రశ్న రావణ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన జిల్లా అధ్యక్షుడు రామస్వామి బాబు డిమాండ్.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 12 July 2026 5:34 PM IST
Peddapuram
X

Peddapuram: మత సామరస్యాన్ని దెబ్బతీస్తే ఊరుకోం!

Peddapuram: ఆంధ్రప్రదేశ్‌లో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా కులాల మధ్య కుట్రలు పన్నుతు వైసీపీ పార్టీని అడ్డుపెట్టుకుని మాట్లాడుతున్న జడ శ్రావణ్ , ప్రశ్న రావణ్ పై కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు.పెద్దాపురం జనసేనపార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులు, శక్తులు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు, వారికి అనుబంధంగా ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.రావణ్, జడ శ్రావణ్ కుమార్, ప్రకాష్ రాజ్‌ల పాత్రపై వస్తున్న ఆరోపణలు, వారి ఆర్థిక సంబంధాలు, అలాగే వీరి వెనుక ఉన్న శక్తులపై నిష్పాక్షిక విచారణ చేపట్టాలని కోరారు.

విదేశీ నిధుల కోణంలో కూడా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.సనాతన ధర్మాన్ని అవమానించేలా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు.దేశ సమైక్యత, జాతీయ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి పనిచేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సామాజిక ఐక్యతను కాపాడేందుకు ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తుమ్మల రామస్వామి బాబు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్.సి. కార్పోరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు,జిల్లా కార్యదర్శి పిట్టా జానకి రామారావు, పెద్దాపురం టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు పొలమరశెట్టి సత్తిబాబు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాధం శెట్టి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఓబులశెట్టి గున్ని, గౌరవ అధ్యక్షులు కఠారి శ్రీను,పెంకే వెంకటలక్ష్మి, త్రిపరగిరి చంద్రముఖి, సామర్లకోట మండల యూత్ అధ్యక్షులు మలిరెడ్డి బుచ్చిరాజు,కొప్పిరెడ్డి నాగబాబు, బెందులూరి స్వామి, విజ్జుపురెడ్డి రాంబాబు,గుండెపల్లి సుధాకర్,కొయ్యనా ధర్మ,దాకమురి శ్రీ హరి,మాట్టే ప్రదీప్, గురు స్వామి,కొర్ర సతీష్, ధరనికోట యోహాన్, పెన్నాడ అన్నవరం, పెద్దిరెడ్ల రామకృష్ణ,వడ్డీ రాజశేఖర్, శికోటి యేసు,ఉలపల్లి రామకృష్ణ,కొర్ర సతీష్,త్రిపరగిరి పద్దరాజు, స్వప్న,ప్యాసు దేవి, సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story