Tondangi: తొండంగిలో గ్యాస్ ఏజెన్సీ తనిఖీ: జేసీ అపూర్వ భరత్

Tondangi: తొండంగిలోని వైష్ణవి దేవి గ్యాస్ ఏజెన్సీని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మికంగా తనిఖీ చేసి, సకాలంలో సిలిండర్లు అందించాలని ఆదేశించారు.

MANIKANTA, TUNI
Updated on: 24 Sept 2026 8:28 PM IST
Tondangi
X

Tondangi: తొండంగిలో గ్యాస్ ఏజెన్సీ తనిఖీ: జేసీ అపూర్వ భరత్

తొండంగి: తొండంగిలోని వైష్ణవి దేవి గ్యాస్ ఏజెన్సీని గురువారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్.. స్థానిక అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ.. ఏజెన్సీ కార్యాలయంలోని రిజిస్టర్లు, ఆన్ లైన్ లోని గ్యాస్ బుకింగ్, డెలివరీ వివరాలను తనిఖీ చేసి, వివరాలు ఆరా తీశారు. డెలివరీ ఆలస్యం కావడం గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం నుంచి గ్యాస్ సిలిండర్లు డెలివరీ పెండెన్సీ ఎక్కువగా ఉండటం వంటి అంశాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోపు గ్యాస్ సరఫరా చేయాలని జేసీ ఆదేశించారు.

ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి అందరికీ సకాలంలో గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని, గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్ ఎటువంటి అదనపు సొమ్ము వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని జేసీ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.

ఈ పరిశీలనలో జేసీ వెంట తొండంగి మండలం తహసీల్దార్ కాంతారావు ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI