Tuni: లోవ తలుపులమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Tuni: తుని లోవ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న 50 వేల మంది భక్తులు. ఒకే రోజున రూ. 14.71 లక్షల ఆదాయం సమకూరిందని వెల్లడించిన ఆలయ ఈఓ.

MANIKANTA, TUNI
Published on: 19 July 2026 6:03 PM IST
Tuni
X

Tuni: లోవ తలుపులమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

తుని: కాకినాడ జిల్లా, తుని మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లోవ శ్రీ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం సుమారు 50,000 మంది భక్తులు దర్శించుకున్నారు. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది.

​ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ విశ్వనాధ రాజు వెల్లడించిన వివరాల ప్రకారం, అమ్మవారి దర్శనాలు, పూజలు మరియు ఇతర సేవల ద్వారా ఆలయానికి ఒక్కరోజే రూ. 14,71,200/- ఆదాయం సమకూరింది.

​ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి:

​పూజా టిక్కెట్లు: రూ. 8,50,608/-

​ప్రసాదాల విక్రయం: రూ. 3,41,025/-

​కాటేజీల ద్వారా: రూ. 1,03,800/-

​ఇతర మిసిలేనియస్ విరాళాలు: రూ. 75,315/-

​వాహనపూజలు & ఇతర సేవా టిక్కెట్లు: రూ. 43,620/-

​కేశకండన టిక్కెట్లు: రూ. 32,280/-

​వేద ఆశీర్వచనం: రూ. 24,552/-

​భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు, క్యూలైన్లు మరియు ఇతర సదుపాయాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ విశ్వనాధ రాజు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పి. భాస్కర సత్యనారాయణ గారు స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేయడంతో దర్శనం సాఫీగా సాగిందని అధికారులు తెలిపారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story