Kakinada: తుని రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: జనసేన అభ్యర్థిగా మీనాక్షి!

Kakinada: తుని మున్సిపల్ చైర్మన్ స్థానానికి జనసేన అభ్యర్థిగా మళ్ల మీనాక్షి ఖరారయ్యారు. టీడీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన మళ్ల గణేష్ సతీమణి ఆమె.

MANIKANTA, TUNI
Published on: 16 Oct 2026 2:32 PM IST
Kakinada
X

Kakinada: తుని రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: జనసేన అభ్యర్థిగా మీనాక్షి!

Kakinada: కాకినాడ జిల్లా తుని మున్సిపల్ రాజకీయంలో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కూటమి సర్దుబాటు ఒప్పందంలో భాగంగా తుని మున్సిపల్ ఛైర్మన్ స్థానం అధికారికంగా జనసేన పార్టీ ఖాతాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. బీసీ మహిళకు కేటాయించిన ఈ ఛైర్మన్ పీఠానికి జనసేన అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా, తాజాగా సంపూర్ణ క్లారిటీ వచ్చేసింది.

​టీడీపీ నుంచి చేరిక.. ఆ వెంటనే ఛైర్మన్ అభ్యర్థిత్వం!

​తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవలే జనసేన పార్టీలోకి చేరిన ప్రముఖ నాయకుడు మళ్ల గణేష్ గారి సతీమణి 'మళ్ల మీనాక్షి' గారి పేరును జనసేన ఛైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. టీడీపీ నుంచి జనసేనలోకి రావడం, రావడంతోనే ఛైర్మన్ అభ్యర్థిగా మళ్ల మీనాక్షి గారి సీటు కన్ఫర్మ్ కావడంతో తుని మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

​జనసేన శ్రేణుల్లో కొత్త జోష్!

​ఒకవైపు ఛైర్మన్ అభ్యర్థిగా మళ్ల మీనాక్షి గారి పేరు ఖరారు కావడం, మరోవైపు నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

​మలుపు తిరగనున్న మున్సిపల్ పోరు!

​ఈ కీలక పరిణామంతో తుని మున్సిపల్ రాజకీయం పూర్తి స్థాయిలో మలుపు తిరిగినట్లయింది. మళ్ల మీనాక్షి గారి అభ్యర్థిత్వం మరియు రానున్న గంటల్లో చోటుచేసుకోబోయే నామినేషన్ల ప్రక్రియ తుని ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేయబోతుందోనని స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI