Tuni: జంతువుల దాడి? కిడ్నాప్? అన్ని కోణాల్లో దర్యాప్తు ఎస్పీ బిందు మాధవ్
Tuni: తునిలో అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు తీవ్రతరమైంది.
Tuni: జంతువుల దాడి? కిడ్నాప్? అన్ని కోణాల్లో దర్యాప్తు ఎస్పీ బిందు మాధవ్
తుని: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సైన ఫామాయిల్ తోటని పరిశీలించిన జిల్లా ఎస్పీ చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చిన్నారి అదృశ్యమైన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి, పరిస్థితులపై ఆరా జ్ఞానేశ్వరి కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నామన్న ఎస్పీ
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతం విస్తారంగా ఉండటంతో ప్రత్యేక బృందాలు జల్లెడ పాడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ శాఖ ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి జంతువుల బారిన పడిందా? లేక ఎవరైనా తీసుకెళ్లారా? అనే అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం.
పెంపుడు కుక్క మృతిపై వస్తున్న అనుమానాలను కూడా పరిశీలిస్తున్నాం. సోషల్ మీడియా, మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేయకండి అసత్య ప్రచారాలు కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన, అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. ప్రజలు, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలి.
చిన్నారి ఆచూకీ కోసం పోలీసు యంత్రాంగం అన్ని కోణాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు వేగవంతం చేస్తున్నాం. చిన్నారి మిస్సైన 10 రోజుల తర్వాత ఘటనాస్థలాన్ని వచ్చిన జిల్లా ఎస్పీ.




