Tuni: డ్రగ్స్ వద్దు బ్రో! తునిలో పోలీసుల భారీ సైకిల్ ర్యాలీ!

Tuni: తునిలో 'ఆపరేషన్ వజ్రప్రహార్' లో భాగంగా పోలీసుల సైకిల్ ర్యాలీ. 'ఫిట్ ఇండియా - డ్రగ్స్ వద్దు బ్రో' నినాదంతో యువతకు సిఐ గీతా రామకృష్ణ పిలుపు.

MANIKANTA, TUNI
Published on: 18 July 2026 10:44 AM IST
Tuni
X

Tuni: డ్రగ్స్ వద్దు బ్రో! తునిలో పోలీసుల భారీ సైకిల్ ర్యాలీ!

Tuni: మాదకద్రవ్యాల నివారణలో భాగంగా 'ఆపరేషన్ వజ్రప్రహార్' కార్యక్రమంలో భాగంగా తుని పోలీసులు శనివారం ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీ ఏబిజి తిలక్ పర్యవేక్షణలో, తుని టౌన్ సిఐ శ్రీ గీతా రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

​'ఫిట్ ఇండియా - డ్రగ్స్ వద్దు బ్రో' అనే నినాదాలతో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో తుని టౌన్ ఎస్సై విజయబాబు మరియు పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తుని టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బాలాజీ సెంటర్, మార్కెట్ ఏరియా, మేదరపేట, తారక రామ్ నగర్ మరియు గొల్ల అప్పారావు సెంటర్ మీదుగా కొనసాగింది.

​ఈ సందర్భంగా తుని టౌన్ సిఐ శ్రీ గీతా రామకృష్ణ మాట్లాడుతూ, సైకిల్ తొక్కడం ద్వారా శారీరక దృఢత్వం పెంపొందడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని, ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. "డ్రగ్స్‌కు అలవాటు పడితే కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే కాకుండా ఆరోగ్యం దెబ్బతింటుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జీవితాలు జైలు పాలు కావాల్సి వస్తుంది" అని ఆయన హెచ్చరించారు.

​యువత సరైన మార్గంలో ఉంటూ, సమాజహితమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story