Tuni: ఒక్కసారిగా మారిన వాతావరణం - భారీ వర్షంతో ఉపశమనం
Tuni: తుని పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో భారీ ఉపశమనం లభించింది.
Tuni: ఒక్కసారిగా మారిన వాతావరణం - భారీ వర్షంతో ఉపశమనం
తుని: కాకినాడ జిల్లా తుని పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గతకొద్ది రోజులుగా తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న స్థానికులకు ఈ అకస్మిక వర్షం భారీ ఉపశమనాన్నిచ్చింది.
మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. కురిసిన ఈ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
తీవ్ర ఉక్కపోత నుంచి విముక్తి లభించడంతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో పట్టణ వాసులు సేదదీరారు.
Next Story




