Peddapuram: ఇద్దరు బ్యాగ్ లిఫ్టర్ల అరెస్ట్ రూ. 20 లక్షల బంగారం స్వాధీనం!
Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురంలో బస్సు ప్రయాణికుల బ్యాగులు దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Peddapuram: ఇద్దరు బ్యాగ్ లిఫ్టర్ల అరెస్ట్ రూ. 20 లక్షల బంగారం స్వాధీనం!
Peddapuram: ఆభరణాలను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను మంగళవారం పోలీసుల అరెస్టు చేసి వారి నుంచి రూ. 20 లక్షలు విలువ చేసే ఆభరణాలను రికవరీ చేశారు. ఈ మేరకు పెద్దాపురం డిఎస్పీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి ఏబిజి తిలక్ చోరీ వివరాలను వెల్లడించారు.
డి.ఎస్.పి మాట్లాడుతూ బాధితులు పి లక్ష్మి తన బంధువుల అమ్మాయి పెళ్లి నిమిత్తం ఏప్రిల్ 30న గోకవరం వెళ్లేందుకు సర్పవరంలో బయలుదేరి సామర్లకోట వచ్చి అక్కడి నుండి రాత్రి సుమారు 7 గంటల సమయంలో గోకవరం వెళ్ళే బస్సు ఎక్కగా పెద్దాపురం వచ్చే సరికి చుసుకోగా పిర్యాది హ్యాండ్ బ్యాగులో నుండి బంగారు నల్లపూసల దండ, నెక్లెస్ రెండు కలిపి సుమారు 64 గ్రాములు దొంగిలించినట్లు గుర్తించారు.
దానితో వారు పెద్దాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్టు చెప్పారు. అలాగే మరో బాధితురాలు ఎం రేఖ అనే ప్రయాణికురాలు ఏప్రిల్ 1 న తెల్లవారుఝామున సుమారు 4.30 గంటల సమయంలో విశాఖపట్నంలో కాకినాడ వెళ్ళే బస్సు ఎక్కి కాకినాడ వచ్చి చూసుకోగా బస్సులో తన బ్యాగ్లో పెట్టుకున్న బంగారు గాజులు -2, బ్రాస్ లైట్-1, బంగారు గొలుసు -1, నల్లపూసల దండ-1, చిన్న నల్ల పూసల దండ -1, బంగారు ఉంగరం-1, చెవిలీలు ఒక జత చోరీ కాబడినట్టు గుర్తించారన్నారు. వాటి మొత్తం బరువు సుమారు 112 గ్రాములు ఉన్నాయన్నారు.
ఈ మేరకు కాకినాడ 2వ పట్టణ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో దానిపై కేసు నమోదు అయినట్టు వివరించారు. ఈ కేసుల్లో ఎటువంటి క్లూ లేనప్పటికీ, కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ డా.మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో పెద్దాపురం డిఎస్పీ ఎబిజీ తిలక్ ఆద్వర్యంలో, పెద్దాపురం సీఐ వైఆర్కె శ్రీనివాస్, పెద్దాపురం క్రైమ్ సీఐ ఆర్ అంకబాబు , పెద్దాపురం పోలీస్ స్టేషన్ ఎస్సై యు పాపారావు, క్రైమ్ సిబ్బంది బాలాజీ, రమణ, బాలబాలాజి లు ప్రత్యేక బృందాలుగా కృషి చేసి ఈ కేసులో ముద్దాయిలైన నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం, సిద్దాపురం గ్రామానికి చెందిన గుంజ గిడ్డన్న (41), తమ్మిశెట్టి వాణి (26) లను మంగళవారం పెద్దాపురం పాండవుల మెట్ట సెంటర్ వద్ద అరెస్ట్ చేసి చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీ వివరించారు.
వీరు సామర్లకోట కు రైలులో వచ్చి తరువాత చుట్టుప్రక్కల రద్దీగా ఉన్న బస్ లలో బ్యాగ్ దొంగతనాలకు పాల్పడుతుంటారని, ప్రయాణీకులు బస్ లలో, ఆటోలలో ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన బంగారు వస్తువులు బ్యాగ్ లలో, కర్రల బ్యాగ్ లలో ఉంచుకోవద్దు అని డి ఎస్పీ తెలిపారు.




