Uppada: సముద్ర తీరంలో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీలు!
Uppada: ఉప్పాడ తీరంలో అర్నాబ్ తుఫాన్ ఉధృతిని పరిశీలించిన కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్. నివేదిక పరిశీలించి స్థలాల కేటాయింపుపై హామీ.
Uppada: సముద్ర తీరంలో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీలు!
ఉప్పాడ: అర్నాబ్ తుఫాను ప్రభావం తో జిల్లా లో మంగళవారం నుంచి కురుస్తున్న ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఉప్పాడ తీర ప్రాంతం పరిస్థితి ని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్.,జిల్లా ఎస్.పి. బిందు మాధవ్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప్పాడబీచ్ రోడ్డును, సముద్రపు అలల ఉధృతి ని క్షేత్రస్థాయి లో పరిశీలించారు.
ఈ సందర్భంగా తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న స్థానిక ప్రజలు తాము తుపాను వచ్చిన ప్రతి సారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,మా కుటుంబాలు చాలా సంవత్సరాలు ఈ ప్రాంతం లో నివాసం ఉంటున్నామని మా కుటుంబీకులు మత్స్య కారులు గా జీవనం సాగించారని..మాకు శాశ్వత పరిష్కారం చూపుతూ వేరే ప్రాంతంలో ఇంటి స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టి కి తీసుకొని రాగా...ఈ అంశం ను పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు..
ప్రజలు అప్రమత్తం గా ఉండాలని,బీచ్ రోడ్డు వైపు ఎవ్వరూ వెళ్లరాదని, సముద్రం లో అలల ఉదృతి ఎక్కువ గా కలదని,ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపార.
తుఫాను ప్రభావం తగ్గే వరకుప్రజలు అప్రమత్తంగా ఉండాలని,జిల్లా యంత్రాంగం సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ డివిజన్ ఆర్డిఓ మల్లిబాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు




