Peddapuram: వడ్లమూరులో పార్టీలకతీతంగా సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక!

Peddapuram: పెద్దాపురం మండలం వడ్లమూరులో గురువారం పార్టీలకతీతంగా గ్రామ పెద్దలు, అన్ని పార్టీల అభ్యర్థులు ఏకమై సర్పంచ్‌గా జల్లూరి శ్యామ్ సుధాకర్‌ను ఎన్నుకున్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 19 Nov 2026 8:29 PM IST
Peddapuram
X

Peddapuram: వడ్లమూరులో పార్టీలకతీతంగా సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక!

పెద్దాపురం: పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జల్లూరి శ్యామ్ సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు, గ్రామ పెద్దలు ఏకతాటిపైకి వచ్చి ఆయనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషంగా నిలిచింది.

గ్రామంలో ఐక్యత, సామరస్యానికి ప్రాధాన్యతనిస్తూ పార్టీలకతీతంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ జల్లూరి శ్యామ్ సుధాకర్ మాట్లాడుతూ.. గ్రామంలోని పెద్దలందరినీ కలుపుకొని, అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, పలువురు గ్రామ పెద్దలు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM