Pithapuram: ప్రత్తిపాడులో వంగవీటి రాధా ఎన్ని పదవులు చేపట్టామనేది కాదు ముఖ్యo!

Pithapuram: పిఠాపురం రూరల్ బి.ప్రత్తిపాడులో ఊట రామకృష్ణ ఆధ్వర్యంలో వంగవీటి రాధా ప్రసంగం. వంగవీటి రంగా నాయకత్వం, అన్ని వర్గాల భరోసాపై సంచలన వ్యాఖ్యలు.

RAMA KRISHNA, KKD
Published on: 20 July 2026 1:45 PM IST
Pithapuram
X

Pithapuram: ప్రత్తిపాడులో వంగవీటి రాధా ఎన్ని పదవులు చేపట్టామనేది కాదు ముఖ్యo!

Pithapuram: మాజీ సర్పంచ్ ఊట రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్ని పదవులు చేపట్టామనేది కాదు.. ఎన్ని తరాలను ప్రభావితం చేశామనేదే గొప్పది – వంగవీటి రాధా

ఏ నాయకుడైనా కేవలం ఒకే కులాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయలేడని, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించే నాయకత్వమే శాశ్వతంగా నిలుస్తుందని వంగవీటి రాధా అన్నారు.

కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన వంగవీటి మోహన రంగా కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అనంతరం ఎమ్మెల్యేగా సుమారు మూడున్నర సంవత్సరాల పాటు మాత్రమే పనిచేసినా, ఆయన చూపిన నాయకత్వం తరతరాలపై చెరగని ముద్ర వేసిందన్నారు.

నేటి రోజుల్లో తాము ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యామనే విషయాన్ని నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ ఎన్ని పదవులు చేపట్టామనేది కాదు, ప్రజల జీవితాలను ఎంతగా ప్రభావితం చేశామనేదే నాయకుడి గొప్పతనానికి నిజమైన కొలమానమని పేర్కొన్నారు. ఆ విషయాన్ని తన జీవితంతో నిరూపించిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని కొనియాడారు.

సామాన్య ప్రజలకు అండగా నిలిచి, ఏ వ్యవస్థనైనా ధైర్యంగా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం, నమ్మకాన్ని కల్పించిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా అని రాధా అన్నారు.

ఈ కార్యక్రమానికి తనతో పాటు జ్యోతుల నవీన్‌ను ఆహ్వానించడం ఆనందంగా ఉందని పేర్కొన్న ఆయన, నిర్వాహకులు, అభిమానులు, పెద్దలు, సోదరులు ఇదే ప్రేమాభిమానాలు, అండదండలు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తమపై కొనసాగించాలని ఆకాంక్షించారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story