Kajuluru: కాజులూరులో రూ.16 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన!
Kajuluru: రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలంలో రూ.16 కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు.
Kajuluru: కాజులూరులో రూ.16 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన!
Kajuluru: కాజులూరు మండలంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సుడిగాలి పర్యటన. రూ.16 కోట్ల పంచాయితీ రాజ్ నిధులతో పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన మంత్రి వాసంశెట్టి.
అభివృద్ధి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను,కాంట్రాక్టర్లను ఆదేశించిన మంత్రి. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రామచంద్రపురం నియోజవర్గం ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. ముఖ్యంగా కాజులూరు మండలాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రామచంద్రపురం నియోజవర్గంలో రూ. 270 కోట్లవ్యయంతో పలు అభివృద్ధి పనులు చేశాం. కాజులూరు మండలంలో నెల రోజులు వ్యవధి లో రూ.22 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేసాం.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తుంది. పెట్టుబడులను భారీగా తీసుకువస్తూ నిరుద్యోగ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు అడుగులు వేస్తోంది. కొత్త పింఛన్ల కోసం ఇప్పటివరకు ఏడు లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చాయన్న మంత్రి.
స్వర్ణాంధ్ర,స్వచ్చాంద్ర లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దత్తు ఇవ్వాలన్న మంత్రి. కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, అధికారులు.




