Samarlakota: మంచినీళ్ల కోసం మున్సిపల్ కార్యాలయం ముందు మహిళల నిరసన

Samarlakota: కాకినాడ జిల్లా సామర్లకోటలోని బలుసులపేటలో గత 20 రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 8 May 2026 2:52 PM IST
Samarlakota
X

Samarlakota: మంచినీళ్ల కోసం మున్సిపల్ కార్యాలయం ముందు మహిళల నిరసన

సామర్లకోట: సుమారు 20 రోజుల నుండి బలుసులు పేట ప్రాంతంలో మున్సిపల్ కుళాయిల నుండి త్రాగునీరు సరఫరా కావడం లేదని సామర్లకోట మున్సిపల్ కార్యాలయం ముందు ఆ ప్రాంతానికి చెందిన మహిళలు మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు ఆధ్వర్యంలో నీళ్ల బిందెలతో నిరసన తెలియజేశారు.

వార్డులో కేవలం బోరు వాటర్ మాత్రమే సరఫరా చేస్తున్నారని, త్రాగేందుకు మంచినీళ్లను సరఫరా చేయడం లేదనీ, కౌన్సిలర్ హరిబాబు మహిళలు ఆరోపించారు.తమ వార్డులో త్రాగేందుకు స్వచ్ఛమైన మంచినీళ్లను సరఫరా చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బలుసుల పేట గొల్లపేట ప్రాంతానికి చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story