Yeleswaram: ఏలేశ్వరంలో రూ.61.84 కోట్లతో సమగ్ర తాగునీటి పథకానికి శంకుస్థాపన

Yeleswaram: ఏలేశ్వరం మున్సిపాలిటీలో ఏఐఐబీ నిధులు రూ.61.84 కోట్లతో ప్రతిపాదించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శంకుస్థాపన చేశారు.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 12 Oct 2026 8:46 PM IST
Yeleswaram
X

Yeleswaram: ఏలేశ్వరంలో రూ.61.84 కోట్లతో సమగ్ర తాగునీటి పథకానికి శంకుస్థాపన

కాకినాడ జిల్లా: ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలోని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించే దిశగా రూ.61.84 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఇంటింటికీ మంచినీటి పథకానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెడిశెట్టి బాబీలు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఏలేశ్వరం మున్సిపాలిటీలో రూ 61.84 కోట్ల ఏఐఐబి నిధులతో సమగ్ర త్రాగునీరు పథకానికి శ్రీకారం చుట్టామని అన్నారు. పట్టణంలోని 8,987 కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుందని అన్నారు.

ఈ పథకంలో భాగంగా ఏలేరు జలాశయం నుంచి 32 లక్షల లీటర్ల నీటిని ఫిల్టర్ బెడ్‌కు తరలించి శుద్ధి చేసిన అనంతరం 16.50 లక్షల లీటర్ల సమగ్ర స్వచ్ఛమైన త్రాగునీరుని పట్టణవాసులకు అందించనున్నామని అన్నారు.

రెండు ట్యాంకుల ద్వారా నీటిని నిల్వ చేసి, పట్టణ ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ పథకం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే ఏలేశ్వరం పట్టణంలో తాగునీటి సమస్యకు ఉపశమనం లభించే అవకాశం ఉందని. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏలేశ్వరు పట్టణాని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు.

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU