Kakinada: చంద్రబాబు పబ్లిసిటీకే ప్రాధాన్యం: కన్నబాబు!
Kakinada: ‘అర్నాబ్’ తుఫాన్‌తో గ్రామాలు అంధకారంలో ఉంటే ప్రభుత్వం సహాయం వదిలేసి పబ్లిసిటీకే ప్రాధాన్యమిస్తోందని వైఎస్సార్సీపీ నేత కన్నబాబు విమర్శించారు.
Kakinada: చంద్రబాబు పబ్లిసిటీకే ప్రాధాన్యం: కన్నబాబు!
Kakinada: చెట్లన్ని నేలకూలాయి రెండు రోజుల నుండి కరెంట్ రాక వేలాది గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. సహయక చర్యలు మీద కాకుండా చంద్రబాబు...పబ్లిసిటీ మీద దృష్టి పెట్డారు.
కూటమీ అధికారంలోకి వచ్చాక ఎన్ని తుఫాన్ లు వచ్చాయి..ఎంత మంది నష్టపోయారో తెలుసా? భాధితులను ఆదుకునే చర్యలు ఎక్కడైనా తీసుకున్నారు.
అర్నాబ్ తుపాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో తీరాన్ని దాటి సముద్రం చొచ్చుకు వచ్చి గ్రామాలను ముంచెత్తాయి. ఇవాళ్టీ వరకు ఒక్క అధికారి కానీ గ్రామాల్లో తిరిగే పరిస్ధితి లేదు
పునరావాస కేంద్రాల్లో భాధితులకు ఒక్క సహయం అందలేదు వైఎస్ జగన్ పాలనలో వాలంటీర్లతో తుఫాన్ , వరద భాధితులకు బియ్యం, నిత్యవసర సరుకులు అందించేవారు.
చంద్రబాబు పాలనలో 17 సార్లు తుఫాన్లు వచ్చాయి. మోంధా తుఫాన్ వల్ల 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది చివరకు 4 లక్షల ఎకరాలని కుదించి ..ఏలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు
అర్నాబ్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులు యాప్ లో నమోదు తీసుకోవాలి అనడం ఎంత వరకు సబబు. ఇవన్నీ మసి బూసి మారేడు కాయ చేయ్యడమే. బుడమేరు ముంపు కు ఏమీ చేయ్యలేక ప్రభుత్వం చేతులెత్తేసింది.
కొవ్వుత్తులు,అగ్గిపెట్లకి రూ.23 కోట్ల అయ్యిందని ప్రభుత్వం చెప్పింది ప్రజలు,రైతులు,భాధితుల పట్ల నిర్లక్ష్యానికి ఇవన్నీ సాక్ష్యాలు గ్రామాలన్ని అతలకుతలం ఐతే వీరికి ఎన్నికలు కావాలి?
మీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏమైంది. జగన్ పాలనలో ఈ క్రాప్ చేసి భీమా క్రింద పంట నష్ట పరిహరం అందించారు. ఇవాళ రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ లేదు..భీమా లేదు. ఉచిత పంటల భీమా ఎత్తేశారు.
రైతులు పాడైపోయారు..ప్రభుత్వం మాత్రం హ్యపీగా చూస్తూ ఉంది. మీ పాలనలో ఇన్‌ఫుట్ సబ్సీడీ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? సహయక చర్యలు అంటే పడవలు.. పొక్లెయిన్ లు ఎక్కి ఫోటోలు దిగడం కాదు.
పబ్లిసిటీ చంద్రబాబు తగ్గస్తే...మిగత పనులు జరుగుతాయి. అర్నాబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి ఎకరానికి..రైతుకు సహయం చేయ్యాలి తుఫాన్ లకు అత్యధికంగా నష్టపోయిన వరికి నష్టపరిహరం పెంచలేదు.కౌలు రైతుల పరిస్ధితి ధీన స్ధితిలో ఉంది.
గత పాలనలో జీవో నెం:5 ద్వారా స్కేల్ ఆఫ్ అసిస్టెన్సీ పెంచింది. అర్నాబ్ వల్ల తీరంలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. సముద్రంలో బోట్లు,వలలు పోయాయి. అర్నాబ్ తుఫాన్ ను పబ్లిసిటీ కోసం వాడుకోవద్దు. రాజీకయం తగ్గించి తుఫాన్ భాధితులను అసదుకోండి.




