Kakinada: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోంది జెడ్పీటీసీ రామకృష్ణ
Kakinada: కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్‌లో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు జరిగాయి.
Kakinada: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోంది జెడ్పీటీసీ రామకృష్ణ
Kakinada: డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేసి అర్హులందరికీ న్యాయం చేయాలి అని కాకినాడ రూరల్ జెడ్పిటిసి నూరుకుర్తి రామకృష్ణ డిమాండ్ చేశారు.కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో రెండవ రోజు డిఎస్సి అవ్వకతకులకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై నిరసన కార్యక్రమం కు మద్దతు తెలిపారు, ఈ సందర్భంగా జడ్పిటిసి నూరుకుర్తి రామకృష్ణ మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవకతవకులకు తక్షణమే సిబిఐ విచారణ చేసి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అన్నారు .
అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కనీసం హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు అని, నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పి కనీసం మాటే మాట్లాడతలేదు అని అన్నారు, ఇది పార్టీ పోరాటం కాదు అని ప్రజలకు న్యాయం చేయాలని చేస్తున్న పోరాటమని అన్నారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




