Sircilla: సిరిసిల్లలో ఘనంగా 17వ బెటాలియన్ పోలీస్ అమరవీరుల బైక్ ర్యాలీ!
Sircilla: సిరిసిల్లలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ బెటాలియన్ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహనతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Sircilla: సిరిసిల్లలో ఘనంగా 17వ బెటాలియన్ పోలీస్ అమరవీరుల బైక్ ర్యాలీ!
Sircilla: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో సమాజ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. చటర్జీ ఆదేశాల మేరకు సర్దాపూర్‌లోని 17వ పోలీస్ బెటాలియన్ ప్రధాన గేటు వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ జగ్గారావుపల్లె, పెద్దూరు మీదుగా సిరిసిల్ల కలెక్టరేట్ చౌరస్తా వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది హెల్మెట్లు ధరించి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించవచ్చని సూచించారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రతపై సందేశాన్ని చాటిచెప్పారు.
ర్యాలీ సందర్భంగా “పోలీస్ అమరవీరులకు జోహార్.. జోహార్” అంటూ నినాదాలు చేస్తూ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, హెల్మెట్ వినియోగం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎం. రాజు, ఇతర అధికారులు, 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.




