Sircilla: ముగిసిన మూడు రోజుల ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ శిక్షణ శిబిరం!
Sircilla: 17వ టీజీఎస్పీ బెటాలియన్‌లో సిద్ధిపేట కమిషనరేట్ పోలీసులకు నిర్వహించిన మూడు రోజుల డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శిక్షణ శనివారంతో ముగిసింది.
Sircilla: ముగిసిన మూడు రోజుల ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ శిక్షణ శిబిరం!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) బెటాలియన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన పోలీసు సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. వరదలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన, నైపుణ్యం ప్రతి పోలీసు సిబ్బందికి ఎంతో అవసరమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.
అనంతరం శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్‌కు చెందిన 31 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సంజీవ రెడ్డి, ఎస్‌డీఆర్‌ఎఫ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ బండి శ్రీనివాస్ పాల్గొన్నారు. మూడు రోజుల శిక్షణలో వరద సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లు, ప్రథమ చికిత్స, బాధితుల తరలింపు, విపత్తుల నిర్వహణలో ఆధునిక పద్ధతులపై సిద్ధాంత, ప్రాయోగిక శిక్షణ అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ శిక్షణతో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం పోలీసు సిబ్బందిలో మరింత పెరిగిందన్నారు.




