Sircilla: 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.. సీనియర్లకు ఘన సన్మానం!
Sircilla: రాజన్న సిరిసిల్లలో స్మైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది.
Sircilla: 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.. సీనియర్లకు ఘన సన్మానం!
సిరిసిల్ల: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో స్మైల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమావేశం లహరి ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ పతాకావిష్కరణ చేసి, అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. మానవ భావోద్వేగాలు, జీవితంలోని తీపి జ్ఞాపకాలు, చారిత్రక ఘట్టాలను కాలగర్భంలో కలిసిపోకుండా ఒక చట్రంలో భద్రపరిచే గొప్ప శక్తి ఫోటోగ్రఫీకి ఉందన్నారు. క్షణాలను అమరత్వంగా మార్చే ప్రతి ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ కృషి ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
ఫోటోగ్రఫీ రంగంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సీనియర్ ఫోటో, వీడియో గ్రాఫర్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి, వారి దశాబ్దాల సేవలను కొనియాడారు.
25 వసంతాలు పూర్తి చేసుకున్న సీనియర్ ఫోటోగ్రాఫర్లు:
సాప సుధాకర్, మహేశ్వరి కృష్ణ, గాజుల సంతోష్, విక్రమ్ శ్రీనివాస్, మంతి దేవేందర్, కమల్ విట్టల్, కంకణాల లక్ష్మణ్, బాలాజీ మధు, గంగవరం చిరంజీవి, రవి, సుబ్బిని ప్రకాశ్, వంకాయల శ్రీకాంత్, లవారి రమేష్, మామిడాల భూమయ్య, లక్ష్మణ్ శేఖర్, బాబు, రేఖ ప్రసాద్, వసుధా భాస్కర్.
ఈ కార్యక్రమంలో స్మైల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాపల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నల్లగొండ దిలీప్, కోశాధికారి సజ్జనం సురేష్, ఉపాధ్యక్షులు రాజూరి భరత్, సహాయ కార్యదర్శి కొత్త సంతోష్తో పాటు కార్యవర్గ సభ్యులు మానాల నరేష్, ఆకునూరి రాజశేఖర్, బూర శామ్యూల్, సిరిగిరి రాజశేఖర్, తవుటీ విజయ్, కొండ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో మరియు వీడియో గ్రాఫర్లందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.




