Karimnagar: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్!
Karimnagar: దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది.
Karimnagar: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్!
కరీంనగర్ : దేశవ్యాప్తంగా ఒకరోజు మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నారు. ఫార్మసీ రక్షణ కోసం ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం బందు పాటిస్తున్నట్లు కరీంనగర్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్విస్ట్ ఫార్మసీ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. ఔషధ నియంత్రణ, ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని, ప్రజలు కూడా ఔషధ షాపులోనే కొనుగోలు చేయాలని ఎలాంటి అనుమతులు లేని ఫార్మామా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రజల ఆరోగ్యాల కోసం మందుల షాపులు 24 గంటలు తెరిచి ఉంచి సర్వీస్ చేస్తున్న ప్రజలు ఇది గమనించి ఈ ఒక్క రోజు జరిగే దేశవ్యాప్త బందుకు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మందులు కొనుగోలు విషయంలో దీర్ఘకాలి ముందుగానే కొనుకోవాలని సూచనలతో గత పది రోజులుగా మెడికల్ షాప్ ల బంద్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశామని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసం ఔషధ షాపులో ఒక్కరోజు బందు పాటిస్తున్నాయని ప్రభుత్వం స్పందించి ఔషధ షాపుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.




