Karimnagar: జ్యోతిష్మతి ఫార్మసీ విద్యార్థుల సత్తా: రూ. 3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు!
Karimnagar: కరీంనగర్ జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటారు.
Karimnagar: జ్యోతిష్మతి ఫార్మసీ విద్యార్థుల సత్తా: రూ. 3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు!
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలకు చెందిన 44 మంది ఫార్మసీ విద్యార్థులు. రూ.3 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపిక కావడం గర్వంగా ఉందని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు పేర్కొన్నారు.
జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, కరీంనగర్‌కు చెందిన ఫైనల్ ఇయర్ బి.ఫార్మసీ విభాగం విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విశేష విజయాన్ని సాధించారు.
కళాశాలకు చెందిన 44 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని మేడ్ ప్లస్ వారి ఆప్టివల్ హెల్త్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ట్రైనీ ఫార్మసిస్ట్‌లుగా ఎంపికై, వార్షికంగా రూ.3 లక్షల ప్యాకేజీ ను పొందారు.
ఈ ఇంటర్వ్యూలు మేడ్ ప్లస్ కు చెందిన HR , అసిస్టెంట్ మేనేజర్ ఆకుల రాజు ఆధ్వర్యంలో జరిగాయి.ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జె. సాగర్ రావు, సెక్రటరీ కరస్పాండెంట్ జె. సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డా. వి. రాజ్‌కుమార్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో కృషి చేసిన ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్, అధ్యాపక బృందాన్ని వారు ప్రశంసించారు. విద్యార్థులు తమ వృత్తి జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి సంస్థకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని యాజమాన్యం ఆకాంక్షించింది.




