Sircilla: సిరిసిల్ల మానస చిల్డ్రన్స్ హాస్పిటల్‌పై ఐదుగురు సభ్యుల కమిటీ తనిఖీ!

Sircilla: సిరిసిల్ల మానస చిల్డ్రన్స్ హాస్పిటల్‌పై కలెక్టర్ ఆదేశాలతో ఐదుగురు సభ్యుల కమిటీ తనిఖీ.

KALEEM, SIRICILLA
Published on: 24 July 2026 10:49 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల మానస చిల్డ్రన్స్ హాస్పిటల్‌పై ఐదుగురు సభ్యుల కమిటీ తనిఖీ!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానస చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో రోగుల నుంచి అధిక వైద్య ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం ఆసుపత్రిని తనిఖీ చేసింది.

తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలో అమలవుతున్న చికిత్స విధానాలు, రోగులకు జారీ చేసిన బిల్లులు, వసూలు చేసిన వైద్య ఛార్జీలు, సంబంధిత రికార్డులు, ఇతర పత్రాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. అలాగే ఆసుపత్రి యాజమాన్యం నుంచి వివరణలు తీసుకుని అవసరమైన వివరాలను సేకరించారు.

పరిశీలన అనంతరం సంబంధిత అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి జిల్లా అధికారులకు సమర్పించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ తనిఖీలో డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. నాగేందర్ బాబు, డా. సౌమ్య, డా. పూర్ణచందర్, డా. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ తనిఖీ చేపట్టారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story