Mallapur: మల్లాపూర్‌లో విషాదం.. వాటర్ హౌస్‌లో పడి ఐదేళ్ల చిన్నారి మృతి!
Mallapur: మల్లాపూర్ గ్రామంలోని ఒడ్డెర కాలనీలో విషాదం నెలకొంది. సూర అంజి – లావణ్య దంపతుల కుమారుడు బన్నీ (5) ప్రమాదవశాత్తు వాటర్ హౌస్‌లో పడి మృతి చెందాడు.
Mallapur: మల్లాపూర్‌లో విషాదం.. వాటర్ హౌస్‌లో పడి ఐదేళ్ల చిన్నారి మృతి!
Mallapur: మల్లాపూర్ గ్రామంలోని ఒడ్డెర కాలనీకి చెందిన సూర అంజి – లావణ్య దంపతుల కుమారుడు సూర బన్నీ (5) ప్రమాదవశాత్తు వన సంరక్షణ సమితికి చెందిన వాటర్ హౌస్‌లో పడి మృతి చెందాడు.
ఈ ఘటనతో ఒడ్డెర కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాలనీవాసులు సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.
మల్లాపూర్ ఎస్ఐ అనిల్ కుమార్ యాదవ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.




