Jammikunta: జమ్మికుంట 8వ వార్డులో రూ.50 లక్షల పనులకు భూమిపూజ
Jammikunta: జమ్మికుంట మున్సిపాలిటీ 8వ వార్డు మారుతి నగర్లో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ భూమిపూజ చేశారు.
Jammikunta: జమ్మికుంట 8వ వార్డులో రూ.50 లక్షల పనులకు భూమిపూజ
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 15 కోట్ల నిధులనుండి 8వ వార్డు మారుతి నగర్ లో స్థానిక కౌన్సిలర్ కొలుగురి సురేష్ తో కలిసి 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ స్థానిక కౌన్సిలర్ సురేష్ ఇచ్చిన మాట ప్రకారం తన వార్డులో రోడ్డు డ్రైన్ సంబంధిత పనులు ప్రజలకు సంబంధించిన ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.
మా పాలకవర్గం ఉన్నంతకాలం 8వ వార్డు ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ మీయొక్క కౌన్సిలర్ ఆధ్వర్యంలో వార్డును మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని తెలుపుతూ జమ్మికుంట పట్టణ పరిధిలోని అన్ని వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొలుగురి సురేష్, మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి,ఏఈ వికాస్,వడ్లకొండ రమేశ్, శ్రీకాంత్,రఫీ తదితరులు పాల్గొన్నారు.




